Chandra Mohan Final Rites: చంద్రమోహన్ అంత్యక్రియలు.. నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు.లైవ్

Chandra Mohan Final Rites: చంద్రమోహన్ అంత్యక్రియలు.. నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు.లైవ్

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2023 | 12:49 PM

తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా... ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్‌. నవరసాలను పలికించగలిగిన నటులను గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శివాజీ గణేశన్‌, కమల్‌హాసన్‌తో పాటు చంద్రమోహన్‌ పేరు కూడా తప్పక వినిపిస్తుంది. అంతగా పాత్రల్లో మమేకమై నటించారు చంద్రమోహన్‌.

తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా.. ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్‌. నవరసాలను పలికించగలిగిన నటులను గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శివాజీ గణేశన్‌, కమల్‌హాసన్‌తో పాటు చంద్రమోహన్‌ పేరు కూడా తప్పక వినిపిస్తుంది. అంతగా పాత్రల్లో మమేకమై నటించారు చంద్రమోహన్‌. అయితే ఆయనకు అప్పటికి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. బీఎస్సీ చదువుకున్న ఆయన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసేవారు. అప్పటికి సమాజంలో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాటకాల వైపు మాత్రం బాగా మొగ్గుచూపేవారు. నాటకాలు వేసిన అనుభవంతోనే సినిమా రంగానికి వెళ్లారు చంద్రమోహన్‌. కొడుకు సినిమాల్లోకి వెళ్లడం చంద్రమోహన్‌ తల్లికి అసలు ఇష్టం ఉండేది కాదు. అయినా తల్లికి సర్ది చెప్పుకుని చెన్నైకి ప్రయాణమయ్యారు. రంగులరాట్నం సినిమాలో కొడుకుని చూసుకున్నాక తల్లి మనసు కుదుటపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 13, 2023 11:29 AM