శ్రీలీల Vs పూజా.. పొరుగు పోటీలో గెలిచేదెవరు?
సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సినిమాల్లో మన మూవీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే, పొరుగు నుంచి వచ్చే సినిమాల మీద, పండక్కి పలకరించడానికి రెడీ అవుతున్న హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టినవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకీ ముగ్గుల పండక్కి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలెవరు? చూసేద్దాం వచ్చేయండి. విజయ్‌తో జోడీ కట్టడం పూజా హెగ్డేకి కొత్త కాదు.
సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సినిమాల్లో మన మూవీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే, పొరుగు నుంచి వచ్చే సినిమాల మీద, పండక్కి పలకరించడానికి రెడీ అవుతున్న హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టినవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకీ ముగ్గుల పండక్కి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలెవరు? చూసేద్దాం వచ్చేయండి. విజయ్‌తో జోడీ కట్టడం పూజా హెగ్డేకి కొత్త కాదు. కానీ, ఈ సారి మాత్రం జననాయగన్ మూవీ చాలా స్పెషల్. విజయ్‌కి ఆఖరి సినిమా అనే కాదు, సంక్రాంతికి హిట్ చూడాలన్న కాంక్ష చాలానే ఉంది పూజాహెగ్డేకి. లక్కీ లేడీగా పేరు తెచ్చుకున్న మమిత కూడా ఈ సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. తమిళం నుంచి పరాశక్తి కూడా పొంగల్ బరిలో ఉంది. శివకార్తికేయన్‌కి జోడీగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు శ్రీలీల. తెలుగులో సరైన సక్సెస్ అందకపోవడంతో పొరుగు సినిమాలతో మెప్పించాలని ప్రయత్నాలు బాగా చేస్తున్నారు మిస్ లీల. ఆమెకు పోటీగా ఈ సారి బరిలో చాలా మందే ఉన్నారు. మీనాక్షికి అనగనగా ఒక రాజు క్లిక్ అయితే హ్యాట్రిక్ సంక్రాంతి రిజిస్టర్ అవుతుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఇద్దరు హీరోయిన్లు పోటీలోకి వచ్చేస్తున్నారు. అటు మన శంకరవరప్రసాద్‌గారుతో నయన్ అండ్ కేథరిన్ రేసులో కనిపిస్తారు. ఇటు రాజాసాబ్ నుంచి కూడా ఇద్దరు లేడీస్ కాంపిటిషన్‌లో ఉంటారు. ఇంతమంది హీరోయిన్లలో నెగ్గేదెవరు? 2026ని పాజిటివ్‌గా ప్రారంభించేదెవరు? అనే క్యూరియాసిటీ బాగానే కనిపిస్తోంది మూవీ లవర్స్ లో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే ఏడాది మార్చ్ లో మాస్ సినిమాల జాతర
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారా ..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

