వచ్చే ఏడాది మార్చ్ లో మాస్ సినిమాల జాతర
వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఎక్కువ ఖర్చీఫులు కనిపిస్తున్నది మార్చి మీదే. అందులోనూ కాస్త మాస్‌గా, వెరైటీగా ఉన్న సినిమాలన్నీ ఆ నెల్లో క్యూలోనే నిలుచున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గట్లేదంటూనే రూటెడ్ లుక్స్ తోనూ ఆకట్టుకుంటున్నాయి. అయినా వాటిలో జర స్పీడు మీదే ఉంది పెద్ది. మిగిలిన సినిమాల ముచ్చట్లేంటి? ఎ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ లో పెద్ది టీమ్ చేసిన హల్‌చల్ తెగ వైరల్ అవుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఎక్కువ ఖర్చీఫులు కనిపిస్తున్నది మార్చి మీదే. అందులోనూ కాస్త మాస్‌గా, వెరైటీగా ఉన్న సినిమాలన్నీ ఆ నెల్లో క్యూలోనే నిలుచున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గట్లేదంటూనే రూటెడ్ లుక్స్ తోనూ ఆకట్టుకుంటున్నాయి. అయినా వాటిలో జర స్పీడు మీదే ఉంది పెద్ది. మిగిలిన సినిమాల ముచ్చట్లేంటి? ఎ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ లో పెద్ది టీమ్ చేసిన హల్‌చల్ తెగ వైరల్ అవుతోంది. చికిరి చికిరి అంటూ ఫస్ట్ సింగిల్‌తోనే మెప్పించింది టీమ్. నెక్స్ట్ ఇయర్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది పెద్ది. డిఫరెంట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు చెర్రీ. ఆయనకే కాదు, జాన్వీకి, డైరక్టర్‌కి, మ్యూజిక్ డైరక్టర్‌కీ.. అందరికీ ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం.ప్యారడైజ్ సినిమాలో నాని లుక్ చూశారా? ఒక్కసారి చూసిన వారెవరైనా సరే మర్చిపోయేలాగా ఉండదు మరి. అందుకే ప్రమోషన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి 26న రిలీజ్ అయ్యే ది ప్యారడైజ్ ప్రమోషన్లు మాత్రమే కాదు, మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పిన టాక్సిక్ ప్రచారం కూడా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు, అలాంటిదేమీ లేదనే భరోసాలు.. ఇలాంటి ప్రమోషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి టాక్సిక్ విషయంలో. వచ్చేది వచ్చే ఏడాదిలోనే అయినా వీరందరితో పోలిస్తే చెర్రీ మాత్రం ఓ అడుగు ముందే ఉన్నారన్నది విజిబుల్‌గా ఉన్న విషయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారా ..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

