Vaani Kapoor: సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ
సక్సెస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ వర్క్ అవుట్ కాకపోవటంతో... బోల్డ్ కంటెంట్ కూడా ట్రై చేశారు. ప్రయోగాలేవి కలిసి రాకపోవటంతో సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నారు. మరి ఈ ఆన్‌లైన్ గ్లామర్ షో అయినా.. అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందా చూడాలి.
సక్సెస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ వర్క్ అవుట్ కాకపోవటంతో… బోల్డ్ కంటెంట్ కూడా ట్రై చేశారు. ప్రయోగాలేవి కలిసి రాకపోవటంతో సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నారు. మరి ఈ ఆన్‌లైన్ గ్లామర్ షో అయినా.. అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందా చూడాలి. 2013లో గ్లామర్ స్టార్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. స్కిన్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ.. స్టార్ ఇమేజ్‌ను అందుకునే విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. కెరీర్‌లో ఒక్క వార్ మూవీ తప్ప మరో హిట్ లేకపోవటంతో అమ్మడికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినా… టాప్ స్టార్స్‌కు మాత్రమే జోడీగా కనిపిస్తున్నారు వాణీ కపూర్. కానీ ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా… అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవటంతో వాణీ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ లేకపోవటంతో… సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు వాణీ కపూర్. ఆన్‌లైన్‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. గ్లామర్ ఇమేజ్ అయినా అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ సింగిల్స్, ఓటీటీ ప్రాజెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టారు వాణీ కపూర్. జూలైలో రిలీజ్ అయిన మండాల మర్డర్స్ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్ తరువాత డిజిటల్‌లో అయినా బిజీ అవ్వాలనుకుంటున్నారు. మరి అలా అయినా వాణీ కల నెరవేరుతుందేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీలీల Vs పూజా.. పొరుగు పోటీలో గెలిచేదెవరు?
వచ్చే ఏడాది మార్చ్ లో మాస్ సినిమాల జాతర
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారా ..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

