ప్రాణ భయంతో.. వేరే దేశంలో ఇల్లు కొన్న స్టార్ హీరో

Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2025 | 8:35 PM

ప్రతీ మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. నీరో , నిప్పో... గాలో ... దూలో.. ఎత్తో..లోతో..! లేక చీకటో.. వెలుగో.. ఇలా ఏదో ఒక భయం వెంటాడుతుంది. కానీ ఈ భయాలన్నింటి కంటే.. అందరికీ ఉండే అతి పెద్ద భయమే ప్రాణ భయం! ఈ భయంతోనే స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.

సైఫ్ అలీఖాన్! పటౌడీల వశంలో పుట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా కంటిన్యూ అవుతున్న ఈ హీరోపై ఇటీవల దాడి జరిగింది. ఓ దుండగుడు.. డబ్బు కోసం సైఫ్‌ ఇంట్లోకి చొరపడి.. ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సైఫ్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. గాయాల నుంచి త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాడు. అయితే ఈ దుర్ఘటన తర్వాత ఎప్పటిలానే తన సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిన సైఫ్‌ అలీఖాన్.. తాజాగా ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఖతార్‌ లో ఇల్లు కొనుగోలు చేసినట్టు చెప్పాడు. అంతేకాదు ఆ ఇల్లు కొనుగోలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయన్న సైఫ్‌.. అక్కడ చాలా సేఫ్టీగా అనిపించిందన్నాడు. త్వరలో తన కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రాణ భయంతోనే.. సైఫ్‌ అలీఖాన్ తన లివింగ్ ప్లేస్‌ను ఛేంజ్ చేస్తున్నట్టు బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!

అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు

అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్‌ చూసి