Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా

Updated on: Jan 28, 2025 | 3:38 PM

రోడ్డు ప్రమాదం తర్వాత సినిమాలు బాగా తగ్గించేశాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్‌. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఏది పడితే అది చేయకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో వంద కోట్ల క్లబ్ లో చేరిన సుప్రీం హీరో ఆ వెంటనే బ్రో చిత్రంలో నటించాడు. ఇందులో తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ సుప్రీం హీరో.

దీని తర్వాత సుమారు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు షూటింగ్ సెట్‌ లో ఇటీవల అభిమానులు భారీగా తరలివచ్చారట. దీంతో తన దగ్గరికి వచ్చిన వారిని అలాగే పంపించకుండా మెగా మేనల్లుడు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలను ఏర్పాటు చేయించాడట. వారి కడుపు నింపి సెల్ఫీలు, ఫొటోలు దిగాడట. తన గొప్ప మనసుతో తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ కడుపు నింపడమే కాదు.. తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సాయి దుర్గ తేజ్ మాట్లాడారట కూడా..! అందరినీ భోజనాలు ఎలా ఉన్నాయ్ అని అడిగాడట. అలాగే జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని అందర్నీ రిక్వెస్ట్ చేశాడట. దీంతో ఫ్యాన్స్‌ అందరూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మంచి మనసులో మామను మించిన అల్లుడు అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్‌

అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా

7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??

అండర్ గ్రౌండ్‌ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!

Published on: Jan 28, 2025 12:55 PM