AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

Phani CH
|

Updated on: Oct 30, 2025 | 1:27 PM

Share

సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలను పెంచుకోవాలని కోరుకుంటే..ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు లాభంలో 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు కేటాయించాలని షరతు విధించారు. ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తామని..అందుకు సంబంధించిన జీవోలో నిబంధనలను సడలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు

ఈ మేరకు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చేందుకు ఒప్పుకుంటేనే టికెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలియచేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. టికెట్ రేట్లు పెరిగితే హీరోకు, నిర్మాతకు డబ్బులు వస్తాయని కానీ కార్మికులకు ఏమీ దక్కదని.. అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని అన్నారు. అంతేకాదు త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం తెలిపారు. ఇటీవల రిలీజైన OG సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే టికెట్ రేట్లు పెంచడం సామాన్యులకు భారమంటూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. కోర్టు నిర్ణయం మేరకు ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అటు కోర్టు తీర్పు..ఇటు ప్రభుత్వ స్టేట్‌మెంట్‌తో భవిష్యత్‌లో తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదన్న ఆందోళన సినీ వర్గాల్లో మొదలైంది. అయితే సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మళ్లీ టికెట్‌ రేట్ల ప్రస్తావన తీసుకు రావడం అందులో కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం ఆసక్తి రేపుతోంది. కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తామని ప్రభుత్వం చట్టం చేస్తే కోర్టుల్లో కూడా సమస్య ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తుందోనన్న ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిజికల్ అయిన పవన్‌, భరణి తీవ్ర గాయాలతో హౌస్‌ బయటకు భరణి..

ఆ డైరెక్టర్‌ పెళ్లికి అదిరిపోయే సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్‌