ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్
బిగ్ బాస్9 ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. మధ్యలో బంధాలు.. అనుబంధాలతో ఈ రియాల్టీ షో కాస్త ఫ్యామిలీ సీరియల్‌గా అనిపించినా కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఫైర్ కారణంగా ఒక్కసారిగా ఊపందుకుంది. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో పాల్గొని.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ఎయిమ్ చేయడంతో .. వారి మధ్య వార్ మరింత పీక్స్‌కు వెళ్లిపోయింది.
అయితే ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. ఈ వీక్ ఓ ముగ్గురు స్టార్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఎనిమిదో వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో అందరికీ బయట ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గౌరవ్, మాధురీలకు మాత్రం అంతగా ఆదరణ లేదు. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్ లో దూసుకుపోతోంది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరిలో ఇప్పటి వరకు తనూజకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఓటింగ్ ఛార్ట్‌లో లీస్టులో ఉన్నది.. మాధురినే. ఎందుకంటే నామినేషన్స్‌లో మాధురి.. రీతూ తో మాట్లాడిన ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మాధురి పై విమర్శలకు దారితీస్తోంది. ఈ కారణం వల్లే ఇప్పటికైతే మాధురినే ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మాధురి కాకుండా డిమాన్ పవన్, రీతూ చౌదరి కూడా ఓటింగ్‌లో లాస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఓటింగ్ సరళి చూస్తుంటే తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ongole: ఒంగోలులో నీటమునిగిన మారుతీ షోరూం
Vijayawada: విజయవాడలో దంచికొట్టిన వాన.. విరిగిపడ్డ చెట్లు
వాగులో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్థులు ఎలా కాపాడారో చూడండి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

