‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
ఈమధ్యే కాదు.. ఎప్పటి నుంచో.. సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు కొన్ని విషయాలపై మరీ సీరియస్‌గా రియాక్టవుతున్నారు. హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మలయాళ హీరో టొవినో థామస్‌ని కూడా కొంత మంది తెలుగు నెటిజన్లు.. అందులోనూ ఆయన తెలుగు ఫ్యాన్స్ కూడా.. ఏకిపారేస్తున్నారు. రీసెంట్‌గా ఈ హీరో తీసుకున్న ఓ నిర్ణయం బుద్దిలేనిదంటూ తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. థియేటర్లలో రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. అదే ఇప్పుడు టొవినో తెలుగు ఫ్యాన్స్‌కు కోపం తెప్పించేలా చేస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అర్జున్ దాస్ దే అని చెప్పవచ్చు. తన తండ్రిని చంపాడంటూ పవన్ కల్యాణ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసే కుర్రాడి పాత్రలో అర్జున్ అదరగొట్టాడు. కేవలం నటనతోనే కాదు తన బేస్ వాయిస్ తోనూ ఓజీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. సుజిత్ మొదట అర్జున్ రోల్ ను .. మలయాళ హీరో టొవినో థామస్‌తో చేయించాలని అనుకున్నాడట. కానీ ఆ హీరో డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పడంతో.. ఈ రోల్ కాస్తా అర్జున్ దాస్ చేతిలోకి వెళ్లిపోయిందట. అలా ఓజీలో మంచి రోల్ మిస్ చేసుకున్నాడు టొవినో థామస్. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో టొవినో తెలుగు ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు. తమ హీరో నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
ఫిజికల్ అయిన పవన్, భరణి తీవ్ర గాయాలతో హౌస్ బయటకు భరణి..
ఆ డైరెక్టర్ పెళ్లికి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

