ఆయన పిలిస్తే..అన్నీ వదిలేసి వెళ్లిపోతా వీడియో
ప్రముఖ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శివుడు పిలిస్తే అన్నీ వదిలేసి కాశీకి వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవుడి జయంతిని పురస్కరించుకుని రేణు దేశాయ్ ఇటీవల కాశీని సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీకి వెళ్తారు. నేను కూడా అంతే, శివుడు పిలిచినప్పుడు అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,కొంతకాలం క్రితం తాను సన్యాసం తీసుకుంటానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు రేణు దేశాయ్. గతంలో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె, అనూహ్యంగా సన్యాసం వైపు మొగ్గుచూపుతున్నారంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
