Razakar: కేంద్ర హోంశాఖ అలర్ట్.! ‘రజాకార్’ ప్రొడ్యూసర్‌కు బెదిరింపు కాల్స్..!
రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తనకు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది నుంచి తనకు హానీ ఉందన్నారాయన. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తనకు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది నుంచి తనకు హానీ ఉందన్నారాయన. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ రజాకార్ సినిమా విడుదల కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమాలో.. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక ఈ వివాదాస్పద చిత్రం మార్చి 15న పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో వరల్డ్ వైడ్ రిలీజైంది. కానీ రిలీజ్‌కు ముందే ఈ మూవీ మేకర్స్.. న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యంతో మేకర్స్ తమ సినిమాను రిలీజ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

