NTR – Devara: గోవా తీరంలో రాజసంగా దేవర.! తారక్ రాకతో ఎరుపెక్కిన సంద్రం.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ సినిమా చిత్రీకరణను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వస్తోన్న అప్‌డేట్స్‌తో రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. దేవర మేకర్స్ ఈ సినిమా నుంచి తాజాగా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ‘దేవర’ పార్ట్ 1 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా ఇండియా రేంజ్‌లో అది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఎక్కువమంది చూసిన గ్లింప్స్‌గా అది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

