మూస ధోరణి మంచిది కాదంటున్న రకుల్
సౌత్, బాలీవుడ్‌లలో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, పెళ్లి తర్వాత పిల్లల్ని కనాలి అనే మూస ధోరణిని వ్యతిరేకించారు. ఆలియా, దీపిక, కియారా వంటి హీరోయిన్‌లు అమ్మలైన తర్వాత కూడా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని ఆమె అన్నారు.
సౌత్ సినిమాల ద్వారా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే సమయంలో, ఆమె బోల్డ్ కామెంట్స్‌తో ట్రెండ్‌లో నిలుస్తున్నారు. ఇటీవల, పెళ్లి తర్వాత హీరోయిన్ల విషయంలో ఎదురయ్యే ప్రశ్నల గురించి ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ సౌత్‌లో స్టార్‌గా రాణించినప్పటికీ, నార్త్‌లో మాత్రం అదే స్థాయిలో జోరు చూపించలేకపోతున్నారని తెలుస్తోంది. వరుస అవకాశాలు వస్తున్నా, స్టార్ లీగ్‌లో ఆమె పేరు వినిపించడంలేదు. కెరీర్‌లో కొంత సతమతమవుతున్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకోవడంతో, రకుల్ కెరీర్ మరింత నెమ్మదించింది. ప్రస్తుతం ఎంపిక చేసుకున్న సినిమాలను చేస్తున్న ఆమె, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తల్లి కావడం విషయంలో తన ఆలోచనను స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ
Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్
TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

