నాగ్‌లోని గొప్ప విషయం అదే! కింగ్‌ను ఆకాశానికెత్తిన రజినీ..
రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. దీంతో తెలుగు టూ స్టేట్స్‌లో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఆగస్టు 14 దగ్గర్లోనే ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్లో.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ వీడియో ద్వారా మాట్లాడారు. అలా మాట్లాడుతూనే మన కింగ్ నాగార్జునతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. దాంతో పాటే సినిమాలో నాగ్ రోల్ గురించి దిమ్మతిరిగే హింట్ కూడా ఇచ్చేశారు రజినీ. ఈ సినిమాలో మొదట విలన్‌గా తానే చేద్దామని అనుకున్నానంటూ చెప్పిన రజినీ.. ఆ తర్వాత ఈ రోల్ కోసం నాగార్జున ఓకే చెప్పారని లోకేష్ చెప్పగానే షాకయ్యా అన్నారు. 33 ఏళ్ల క్రితం నాగార్జునతో ఓ సినిమా చేశా.. అప్పుడు నాగ్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారన్నారు రజినీ కాంత్. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ చూసి.. ఇలా ఎలా ఉండగలరు అంటూ అడిగానని చెప్పారు. అందుకు ఆయన సింపుల్‌గా డెయిలీ వర్కౌట్స్ చేస్తానంటూ తనకు బదులిచ్చారని చెప్పారు రజినీ. వర్కవుట్స్‌తో పాటే తాను ఏదీ మనసులోకి తీసుకొనంటూ నాగ్ చెప్పారని.. ఆయన యంగ్ గా కనిపించడానికి ఇదే సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. అంతేకాదు నాగార్జునతో గడిపిన రోజులను తాను లైఫ్ లో మర్చిపోలేనని చెప్పారు రజినీ. నాగ్ తో మాట్లాడిన మాటలు.. నాగ్ తనకు ఇచ్చిన సలహాలను ఎప్పుడూ లైఫ్ లో మర్చిపోలేనంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పారు రజినీ కాంత్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరు జారిన రజినీ.. తప్పుడబుతున్న రాజమౌళి ఫ్యాన్స్
నేను నో చెప్పినా లోకేష్ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

