నేను నో చెప్పినా లోకేష్ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ
కూలీ సినిమా హీరో రజినీ కాంతే కావచ్చు... కానీ రజినీని మించేలా జరిగిన ప్రతీ ఈవెంట్లో.. ప్రమోషనల్ కార్యక్రమాల్లో హైలెట్ అవుతున్నారు కింగ్ నాగ్. మొన్నటి వరకు లోకేష్ మాటల కారణంగా నెట్టింట ట్రెండ్ అయిన కింగ్ నాగ్.. ఇప్పుడు రజినీ కారణంగా అక్రాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దాంతో పాటే ఈ మూవీ ప్రిలీజ్ ఈవెంట్లో తాను చెప్పిన మాటల కారణంగా కూడా... నెట్టింట తెగ తిరుగేస్తున్నాడు ఈ ఆంటోనీ!
కెరీర్లో కొత్త కొత్తవి చేయడం తనకు ఇష్డమని చెప్పిన నాగార్జున.. ఓ రోజు లోకేష్ వచ్చి ‘విలన్ రోల్ చేస్తారా సర్’ అని అడిగారని చెప్పాడు. తాను నో చెప్పినా కూడా కూల్‌గా తీసుకుని అంతే కూల్‌గా తన వెంట పడ్డాడని… చివరికి ఒప్పించాడని చెప్పుకొచ్చాడు నాగ్. తన ఆంటోనీ క్యారెక్టర్.. ఈసినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అది కూడా తను ఈ సినిమాన చేయడానికి ఒక కారణం అంటూ నాగ్ చెప్పాడు. అంతేకాదు లోకేష్ కథ చెప్పేటప్పుడు తాను రికార్డ్ చేసుకున్నా.. ఇంటికి వెళ్లి మళ్లీ విన్నాను.. ఆ తర్వాత తాను కొన్ని పాయింట్స్ చెప్పా.. వాటిని లోకేష్ ఎంతో కూల్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత 6,7సార్లు కథ చెప్పాడు. అలా ఫైనల్ గా కథను రెడీ చేశాడంటూ చెప్పాడు నాగ్. లోకేష్ అద్భుతంగా కథను రాసుకున్నాడు. రెండు రోజుల షూట్ చేశాం. రెండో రోజు షూట్ లో మేము ఓ సీన్ చేశాం.. కానీ అది లీక్ అయ్యింది. ఆ సీన్ లీక్ అయినప్పుడు చాలా భాదగా అనిపించిందంటూ చెప్పాడు నాగ్. కానీ ఆ సీన్ షూట్ తర్వాత సార్ మీరు ఇరగదీశారు అని లోకి చెప్పడం తనకు ఆనందాన్ని ఇచ్చిందంటూ చెప్పాడు నాగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్
వరదల్లో కొట్టుకుపోయిన 20 కోట్ల నగలు.. ఎగబడిన జనం
9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

