Nivin Pauly: స్టార్ హీరో లైంగిక దాడి ఆరోపణ సిరియస్‌గా రియాక్టయిన నివిన్.!
కేరళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక పెను దుమారాన్ని సృష్టించింది. కేరళలోనే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమల్లోనూ నటీమణులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారని.. ఎక్కడికి వెళ్లినా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ఆరోపించారు. ఇప్పటికే కొందరు నటీమణులు సదరు యాక్టర్స్ పై ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో 17 కేసులు నమోదయ్యాయి.
కేరళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక పెను దుమారాన్ని సృష్టించింది. కేరళలోనే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమల్లోనూ నటీమణులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారని.. ఎక్కడికి వెళ్లినా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ఆరోపించారు. ఇప్పటికే కొందరు నటీమణులు సదరు యాక్టర్స్ పై ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా మలయాళీ యంగ్ హీరో నివిన్ పౌలీపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. సినిమాలో అవకాశం ఉందని.. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటూ తనను దుబాయ్ తీసుకెల్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది.
అయితే మొత్తం ఆరుగురు వ్యక్తులపై దాఖలైన ఈ కేసులో హీరో నివిన్ పౌలీ పేరును ఆరో నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా ఈ కేసులో మొదటి నిందితురాలిగా మరో అమ్మాయి పేరును చేర్చారు పోలీసులు. ఈ క్రమంలోనే నివిన్ ను వివరణ కోరారు.
ఇక తనపై నమోదైన కేసు గురించి హీరో నివిన్ పౌలీ కూడా రియాక్టయ్యారు. ఇండస్ట్రీలో తనపై వస్తున్న ఆరోపణలపై సుధీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తనపై వస్తున్న లైంగిక వేధింపుల కేసు పూర్తిగా అవాస్తవమని తన ఇన్ స్టాలో ఓ నోట్ షేర్ చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోవాలని ఆ నోట్ లో రాసుకొచ్చారు నివిన్. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు తాను కచ్చితంగా ఎక్కడికైనా వెళ్తానన్నాడు. అలాగే ఇందుకు కారకులు అయిన వారిని వెలుగులోకి తీసుకువస్తానని.. వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానంటూ.. తన పై వస్తున్న వార్త పై సీరియస్ గా రియాక్టయ్యాడు ఈ స్టార్ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.