ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్.. అందరికీ టికెట్స్ ఫ్రీ..
80వ దశకంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ పోటీపడి నటించారు. 1981లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఏకంగా 527 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాను 75 వారాలు ప్రదర్శించారంటే ఈ మూవీ అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పవచ్చు.
చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అజరామరమే. నాలుగు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి థియేటర్లలో విడుదలకాబోతోంది. అదికూడా ఉచితంగా థియేటర్‌కి వెళ్లి చూడొచ్చు. ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా అక్కినేని అభిమానుల కోసం ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అక్కినేని హిట్స్‌లో మరో ఆణిముత్యం లాంటి సినిమా డాక్టర్ చక్రవర్తి. నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి నటించిన ఈ సినిమా 1964లో విడుదలైంది. ఇందులో మహానటి సావిత్రి.. అక్కినేనికి సోదరిగా నటించింది. అన్నాచెల్లెళ్లుగా అక్కినేని, సావిత్రి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. సెప్టెంబరు 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు థియేటర్లలో ఉచితంగe ప్రదర్శించనున్నారు. ఈ రీ రిలీజ్ టికెట్లు సెప్టెంబరు 18 నుంచి బుక్‌మై మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న థియేటర్ల విషయానికి వస్తే విజయవాడలో స్వర్ణ ప్యాలస్, విశాఖపట్నంలో క్రాంతి థియేటర్, ఒంగులులో కృష్ణ టాకీస్ వంటి ముఖ్య నగరాల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇక హైదరాబాద్‌లో థియేటర్లు ఇంకా ఎంపిక కావలసి ఉంది. వీటితోపాటు మరికొన్ని నగరాల్లో కూడా ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. ఏఎన్నార్ సినిమాలు అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ రీరిలీజ్ ద్వారా ఆయన అప్రతిహత సినీ సేవలను గుర్తుచేసుకుంటూ, పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరికీ మరిచిపోలేని అనుభూతిని అందజేసే ప్రయత్నంచేయనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆమె..!
Deepika Padukone: కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

