RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆమె..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నామధ్య వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ.. కోర్టులు చుట్టూ తిరిగారు.. దాని నుంచి బయటపడే లోగా మరో కేసులో ఆర్జీవీ ఇరుక్కున్నారు. ఎస్ ! రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదైంది ఇప్పుడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ మహిళా IPS రామ్ గోపాల్ వర్మ దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదు చేశారు.
తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్‌ను దహనం అనే వెబ్ సిరీస్‌లో వాడారని రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం సిరీస్‌కు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. దీంతో రామ్ గోపాల్ వర్మ పై కేస్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. IPC 509, 468, 469, 500, and 120(B).సెక్షన్ ల కింద ఆయనపై ఎఫ్ ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో.. దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. కమ్యూనిస్ట్ నేత రాములును ఎలా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. ఆ సందర్భంగా ..ఒక ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించామని చెప్పారు ఆర్జీవీ. అయితే, అందులో వాస్తవం లేదని, సినిమాలో అంతా తప్పుగా చూపించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా తన పేరును వాడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

