Prabhas: చెర్రీ తనయ క్లీంకార కు డార్లింగ్ ప్రభాస్‌ నుంచి స్పెషల్ గిఫ్ట్..

Prabhas: చెర్రీ తనయ క్లీంకార కు డార్లింగ్ ప్రభాస్‌ నుంచి స్పెషల్ గిఫ్ట్..

Anil kumar poka

|

Updated on: Jun 07, 2024 | 9:51 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్ నడిపిన కారు బుజ్జీ ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జీని తిప్పుతున్నారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్ నడిపిన కారు బుజ్జీ ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జీని తిప్పుతున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కి టీమ్ సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపుతోంది. ఈక్రమంలోనే తాజాగా రామ్‌ చరణ్‌- ఉపాసనల కుమార్తె క్లీంకార కొణిదెలకు కల్కి మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది.

ఇక ఆ గిఫ్ట్ ప్యాక్‌లో బుజ్జి – భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పిందీ మెగా కోడలు. ప్రస్తుతం బుజ్జి, భైరవ స్టిక్కర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ గిఫ్ట్ ప్యాక్స్‌ను… క్లీంకారకు మాత్రమే కాదు.. మరికొంత మంది సెలబ్రిటీ కిడ్స్‌కు కూడా కల్కి మూవీ టీం పంపినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.