Naveen Vijay krishna: జీవితంలో చాలా కోల్పోయా..! నరేష్‌ కొడుకు విజయ్ ఆవేదన..

Naveen Vijay krishna: జీవితంలో చాలా కోల్పోయా..! నరేష్‌ కొడుకు విజయ్ ఆవేదన..

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 9:03 AM

నవీన్ విజయ కృష్ణ అంటే.. వెంటనే తెలియక పోవచ్చు..! కానీ నరేష్ కొడుకు అంటే మాత్రం కాస్త మెల్లిగానైనా ఈ హీరో ఫేస్‌ గుర్తుకువస్తుంది. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడనే విషయం కూడా మైండ్లోకి వస్తోంది. దాంతో పాటే.. ఈయన ఇలా మారిపోయాడేంటనే ఎక్స్‌ప్రెషన్‌ కూడా మనలో కలుగుతోంది. చాలా రోజుల తర్వాత ఎందుకు మీడియా ముందుకు వచ్చారనే డౌట్ కూడా మదిలో మెదులుతుంది.

నవీన్ విజయ కృష్ణ అంటే.. వెంటనే తెలియక పోవచ్చు..! కానీ నరేష్ కొడుకు అంటే మాత్రం కాస్త మెల్లిగానైనా ఈ హీరో ఫేస్‌ గుర్తుకువస్తుంది. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడనే విషయం కూడా మైండ్లోకి వస్తోంది. దాంతో పాటే.. ఈయన ఇలా మారిపోయాడేంటనే ఎక్స్‌ప్రెషన్‌ కూడా మనలో కలుగుతోంది. చాలా రోజుల తర్వాత ఎందుకు మీడియా ముందుకు వచ్చారనే డౌట్ కూడా మదిలో మెదులుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే..! సీనియర్ నరేష్ ముద్దుల కొడుకుగా.. ఆయన అమ్మ విజయ నిర్మల ముద్దుల మనవడిగా.. సినిమాల్లో ఎడిటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్.. ఆ తర్వత తన నాన్నమ్మ కోరిక మేరకు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఓ రెండు మూడు సినిమాలు కూడా చేశారు. కానీ ఈ క్రమంలోనే తన నానమ్మ మరణించడంతో.. ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆ కారణంగా లావు కూడా అయ్యారు. కానీ తాజాగా బౌన్స్ బ్యాక్‌ అయి.. తన బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్‌తో.. సోల్ ఆఫ్ సత్య వీడియో సాంగ్ తెరకెక్కించారు. ఇక ఈ సాంగ్‌ను ప్రమోట్ చేసే క్రమంలోనే మీడియా ముందుకు వచ్చారు. దాంతో పాటే.. తన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలను కూడా చెప్పి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని చెప్పిన నవీన్.. నానమ్మ విజయనిర్మల, అమ్మ నేత్ర.. తననెప్పుడూ మంచి స్థాయిలో చూడాలనుకున్నారన్నారు. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయానంటూ.. కాస్త ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తనకు తన నానమ్మే ఇన్‌స్పిరేషన్‌ అని.. తన సినిమాలు చేసేటప్పుడు సెట్స్‌లో ఉండేవాడినని.. అప్పుడే డైరెక్టర్‌ అవ్వాలనే ఆలోచన తనలో వచ్చిదన్నారు నవీన్. కానీ నానమ్మ విజయ నిర్మలకు మాత్రం తాను నటుడినవ్వాలని కోరుకునేదన్నారు. అందుకే తనకోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చానని.. ఇప్పుడేమో సోల్ ఆఫ్ సత్య సాంగ్‌తో డైరెక్టర్‌గా మీ ముందుకు వస్తున్నా అన్నారు. అంతేకాదు ‘మూడు సంవత్సరాల క్రితం.. ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్‌లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయని.. జీవితంలో చాలా కోల్పోయిన దగ్గరి నుంచి మళ్లీ ఇక్కడి వరకు మళ్లీ వచ్చా అంటూ ఎమోషనల్ అయ్యారు… తన ఫ్యామిలీ పరిస్థితి కారణంగానే ఇలా ఎమోషనల్ అయ్యారేమో అనే డౌట్‌ నెటిజెన్స్‌ అందర్లో కలిగేలా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...