Mix Up Review: హిట్టా.? ఫట్టా.? బోల్డ్ కంటెంట్ తో వచ్చిన మిక్స్ అప్ మూవీ రివ్యూ.

Mix Up Review: హిట్టా.? ఫట్టా.? బోల్డ్ కంటెంట్ తో వచ్చిన మిక్స్ అప్ మూవీ రివ్యూ.

Anil kumar poka

|

Updated on: Mar 17, 2024 | 12:55 PM

ఈ మధ్య బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు బోలెడు వస్తున్నాయి. తాజాగా ఆహాలో కూడా భార్యా భర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, పెళ్లిలో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా మిక్స్ అప్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.! అభి అలియాస్ క‌మ‌ల్ కామ‌రాజు, నిక్కీ అలియాస్ అక్ష‌ర గౌడ‌ భార్యా భ‌ర్త‌లు. అభి చాలా సాఫ్ట్ గా ఉంటాడు. భార్య‌ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ నిక్కీ మాత్రం అలా కాదు.

ఈ మధ్య బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు బోలెడు వస్తున్నాయి. తాజాగా ఆహాలో కూడా భార్యా భర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, పెళ్లిలో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా మిక్స్ అప్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.!

అభి అలియాస్ క‌మ‌ల్ కామ‌రాజు, నిక్కీ అలియాస్ అక్ష‌ర గౌడ‌ భార్యా భ‌ర్త‌లు. అభి చాలా సాఫ్ట్ గా ఉంటాడు. భార్య‌ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ నిక్కీ మాత్రం అలా కాదు. అన్ని విషయాలను చాలా రఫ్ గా ఉంటుంది. చివరికి శృంగారం దగ్గర కూడా భర్త మనసు తెలుసుకోకుండా చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తుంది. దాన్ని భరించలేకపోతాడు అభి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో పాటు విడిపోవడానికి సిద్ధమవుతారు. మరోవైపు సాహు అలియాస్ ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, మైథిలి అలియాస్ పూజా జావేరీ జంట‌ది పూర్తిగా వ్యతిరేకమైన కథ. త‌న‌ని సాహు అర్థం చేసుకోవ‌డం లేద‌ని మైథిలీ కంప్లైంట్. ఇక సాహూ దృష్టిలో మైధిలిని కేవలం ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గా చూస్తాడు. దాంతో సహజంగానే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎప్పుడు వస్తుంటాయి. సెక్స్ లో లైఫ్ ఉండాలి అనేది మైథిలి ఆలోచన. కానీ ఖచ్చితంగా సెక్స్ ఉండాలి అనేది సాహు ఆలోచన. దాంతో ఇద్దరి మధ్య పడక విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఈ రెండు జంటలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దాంతో ఆ డాక్టర్ ‘కొన్నిరోజులు ఎక్క‌డికైనా వెళ్లి స‌ర‌దాగా గ‌డిపి రండి.. ప‌రిస్థితులు స‌ర్దుకొంటాయి’ అని స‌ల‌హా ఇస్తుంది. దాంతో ఈ రెండు జంట‌లూ గోవా వెళ్తాయి. అక్క‌డ ఏమైంది? వీళ్ల కాపురాలు నిలబడ్డాయా లేదంటే ఇంకా ఎక్కువగా గొడవలు అయ్యాయా అనేది మిగిలిన కథ..

భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను రెండు రకాలుగా చూపించవచ్చు. ఒకటి సామరస్యంగా పరిష్కరించవచ్చు. మరొకటి బోల్డ్ కంటెంట్ తో కూడా చూపించవచ్చు. దర్శకుడు ఆకాష్ బిక్కి ఇక్కడ రెండో మార్గాన్ని ఎన్నుకున్నాడు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అనుకున్నాడు. అందుకే సెక్స్ అనే పదాన్ని కూడా విచ్చలవిడిగా సినిమాలో వాడాడు. కొన్నిచోట్ల మితిమీరిన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి. తెలుగులో ఇలాంటి ఒక బోల్డ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయడం నిజంగానే ఒక సాహసం. కానీ ఈ విషయంలో ఆహా ముందడుగు వేసింది. దర్శకుడు చెప్పిన కథను నమ్మి వాళ్ళు ఆహాలో ఈ సినిమాను విడుదల చేయడం నిజంగానే ఒక డేరింగ్ స్టెప్. ఇందులో కొత్త కథ అంటూ ఏమీ లేదు. ఇద్దరు జంటలు మనస్పర్ధలతో గోవా వెళ్తారు. కానీ అక్కడ ఈ రెండు జంటలు విడిపోయి వేరే వాళ్లకు కనెక్ట్ అవుతారు. భిన్న మ‌న‌స్త‌త్వాలున్న వ్యక్తులు భార్యా భర్తలుగా ఉంటే వాళ్ల కాపురంలో ఎన్ని మనస్పర్ధలు వస్తాయనేది ఈ సినిమాలో చూపించారు. దానికి సెక్స్ కూడా ప్రధాన కారణంగా ఉంటుందని దర్శకుడు ఆలోచన. ఒకరు సెక్స్ ను కేవలం ఆబ్జెక్ట్ ల ఎంజాయ్ చేస్తే.. మరొకరు ఆ సెక్స్ లో కూడా ఎమోషన్ ఉండాలని కోరుకుంటారు. బహుశా బాహ్య ప్రపంచంలో విడాకులు తీసుకొందాం అనుకొన్న ప్ర‌తీ 10 జంట‌ల్లోనూ 9 జంట‌ల సమస్య ఇలాగే ఉంటుందేమో. గోవాలో జ‌రిగే డ్రామానే ఈ క‌థ‌కు మ‌లుపుని తీసుకొచ్చాయి. అక్క‌డ ఒకరి భార్యతో మరొకరు సన్నిహితంగా ఉండడం.. వాళ్ల భార్యలో లేనిది ఇంకొకరి భార్య దగ్గర పొందడం.. తమ భర్త దగ్గర పొందలేని ప్రేమను ఇంకొకరి భర్తలో చూసుకోవడం.. ఇవన్నీ చూడడానికే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి కానీ మన సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అని చూపించాడు దర్శకుడు ఆకాష్. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.

రెండు జంటలు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఆదర్శ్ బాలకృష్ణ బోల్డ్ క్యారెక్టర్ బాగానే చేశాడు. మరోవైపు కమల్ కామరాజు ఇలాంటి పాత్ర చేయడం కొత్తగా అనిపించింది. ఇక హీరోయిన్లు అక్షరా గౌడ, పూజ జవేరి ఇద్దరూ గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గలేదు. బోల్డ్ కంటెంట్ కావడంతో మరింత రెచ్చిపోయారు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

కౌశిక్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. అలాగే సత్య ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి. దర్శకుడు ఆకాష్ బిక్కీ తీసుకున్న కథ బాగుంది. కథనం కూడా ఆసక్తికరంగానే ఉంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త వేగంగా ఉండుంటే మిక్స్ అప్ ఇంకా మంచి సినిమా అయ్యుండేది. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మిక్స్ అప్.. నేటి యువతకు కనెక్ట్ అయ్యే బోల్డ్ ఫ్యామిలీ డ్రామా..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 17, 2024 12:54 PM