Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి గవర్నర్ అభినందనలు..
గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను సతీసమేతంగా కలిశారు చిరంజీవి. పద్మవిభూషణ్ ను ఎంపికైన సందర్భగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్. అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను సతీసమేతంగా కలిశారు చిరంజీవి. పద్మవిభూషణ్ ను ఎంపికైన సందర్భగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్. అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ ను ప్రకటించింది కేంద్రప్రభుత్వం. తనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి చిరు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
Published on: Feb 09, 2024 06:44 PM
వైరల్ వీడియోలు
Latest Videos