Waltair Veerayya Success Celebrations Live: సందడిగా వీరయ్య విజయవిహారం.. మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు..
వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు మెగాస్టార్.
వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు మెగాస్టార్. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు చిరు. వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కూడా మరిచిపోలేనిది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం.రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి నుంచి లాభాల పరంగా వచ్చిన అతిపెద్ద బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య. 90 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇప్పటికే 220 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే చిరంజీవి 200 కోట్ల క్లబ్బులో చేరడం ఇది రెండోసారి. 2019లో విడుదలైన సైరా 236 కోట్లు వసూలు చేసింది. అయితే బిజినెస్ ఎక్కువగా చేయడంతో.. ఈ చిత్రం లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..