Guntur Karam Making Video: మిర్చీల మధ్య బాబు కష్టం.. మామూలుగా లేదుగా.! హైప్ క్రియేట్ చేసిన వీడియో.

Guntur Karam Making Video: మిర్చీల మధ్య బాబు కష్టం.. మామూలుగా లేదుగా.! హైప్ క్రియేట్ చేసిన వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 12, 2024 | 7:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది . మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ ను మునుపెన్నడూ చూడని లుక్ లో చూపించనున్నారు త్రివిక్రమ్. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది . మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ ను మునుపెన్నడూ చూడని లుక్ లో చూపించనున్నారు త్రివిక్రమ్. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గుంటూరు కారం సినిమా ట్రైలర్, సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేర్చింది. మహేష్ బాబు యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పక్కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు కారం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గుంటూరు కారం సినిమా కోసం చిత్రయూనిట్ ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోలో మహేష్ బాబు ఎనర్జీ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు త్రివిక్రమ్ భారీ విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్‌ కూడా ఇదే చెబుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దానికి తగ్గట్టే అటు బుకింగ్స్ లోనూ గుంటూరు కారం సినిమా దూసుకుపోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 12, 2024 07:12 AM