Pawan Kalyan: పవర్‌స్టార్‌ నెక్స్ట్ మూవీకి కెప్టెన్‌ ఎవరు ??

Updated on: Nov 28, 2025 | 6:41 PM

"కూలీ" విషయంలో కుదుపు, "లియో" మిశ్రమ స్పందనల తర్వాత లోకేష్ కనగరాజ్ వ్యూహం మారింది. ఒకే సినిమా కాకుండా, ఒకటికి మించి ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అరుణ్ మాదేశ్వరన్‌తో సినిమా చేస్తున్న లోకేష్, "ఖైదీ 2" వాయిదా వేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. తన తదుపరి చిత్రం పవర్‌స్టార్, డార్లింగ్, ఐకాన్ స్టార్‌లలో ఎవరితో అనేది సస్పెన్స్.

ఒకటే పని చేస్తానంటే కుదిరే పరిస్తితులు లేవిప్పుడు. ఒకటికి రెండు, వీలైతే అంతకు మించి చేయాల్సిన సిట్చువేషన్‌ ఉంది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు లోకేష్‌ కనగరాజ్‌. రీసెంట్‌గా రజనీకాంత్ తో తెరకెక్కించిన కూలీ విషయంలో కాస్త కుదుపు కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారీ డైరక్టర్‌. ఇంతకీ లోకీ కాంపౌండ్‌లో ఏం జరుగుతోంది? లియో తర్వాత కూలీ సాలిడ్‌ హిట్‌ అవుతుందనుకున్నారు లోకేష్‌ కనగరాజ్‌. లియోకి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా గట్టిగానే నిలదొక్కుకున్నారు. కానీ, కూలీ విషయంలో డ్యామేజ్‌ కంట్రోల్‌ పెద్దగా జరగలేదు. పైగా కమల్‌ ప్రొడక్షన్‌లో రజనీ సినిమాకు లోకేష్‌ డైరక్ట్ చేస్తారనే వార్త కూడా నిజం కాలేదు. దీంతో మరింత అగ్రెసివ్‌ గా కనిపిస్తున్నారు లోకేష్‌. ఇప్పుడు అరుణ్‌ మాదేశ్వరన్‌ డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు లోకేష్‌ కనగరాజ్‌. యాక్షన్‌ సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా మాస్‌ ఆడియన్స్ కోసం తీస్తున్నారనే హింట్స్ అందుతున్నాయి. ఈ సినిమా తర్వాత లెక్క ప్రకారమైతే ఖైదీ2ని సెట్స్ మీదకు తీసుకురావాలి లోకేష్‌ కనగరాజ్‌. కానీ అది జరగడం లేదనే వార్తలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాకు సీక్వెల్‌ని ఎప్పుడైనా తీయొచ్చు. కానీ, ఫ్రెష్‌ సబ్జెక్ట్ తో ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నారట లోకేష్‌. ఖైదీ2ని పక్కన పెట్టి పవన్‌ కల్యాణ్‌ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు టాక్‌. దీని కోసం కొత్త రైటింగ్‌ టీమ్‌ని ఫామ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు రెడీ అవుతున్న స్క్రిప్ట్ ఎవరికి అనే డైలమా కనిపిస్తోంది. పవర్‌స్టార్‌, డార్లింగ్‌, ఐకాన్‌ స్టార్‌ పేర్లు వరుసగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లల్లో లోకేష్‌ నెక్స్ట్ స్టెప్‌ ఎవరితో అన్నది సస్పెన్స్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం

Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది

చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది

ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే

కరెంట్‌ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..