Avatar: Fire and Ash: నెక్స్ట్ అవతార్‌కి కలెక్షన్లు ఎలా ఉంటాయి ??
అవతార్ 3 రిలీజ్ దగ్గరపడుతుండటంతో, ఇండియా బాక్స్ ఆఫీస్ అంచనాలు ఊపందుకున్నాయి. మునుపటి అవతార్ 2 తొలిరోజు వసూళ్లు ₹39.90 కోట్లతో పోలిస్తే, అవతార్ 3 కి ₹30-35 కోట్లు రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారత ప్రేక్షకులు అవతార్ సినిమాలను అద్భుతంగా ఆదరించారు. ఈ తదుపరి భాగం కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
విజువల్ గ్రాండియర్ టాపిక్ వచ్చాక అవతార్ గురించి మాట్లాడుకోకపోతే ఎలా అంటారా? ఎందుకు ఆలస్యం అవతార్ నెక్స్ట్ చాప్టర్ గురించి మాత్రమే కాదు, ఫస్ట్ డే ఆ సినిమా మన దగ్గర ఎంత కలెక్ట్ చేసే అవకాశాలున్నాయో కూడా లెక్కలేసుకుంటున్నారు ట్రేడ్‌పండిట్స్. ఆ డీటైల్స్ మనం కూడా షేర్ చేసుకుందాం. ఇండియన్ ఆడియన్స్ మనసులు దోచుకున్న సినిమాల్లో ఫస్ట్ బెంచ్‌లో కనిపిస్తుంది అవతార్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన రెండు పార్టులకూ ఇండియాలో అద్భుతమైన రిసెప్షన్ అందింది. ఇప్పటికీ అవతార్ ది వే ఆఫ్ వాటర్‌ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు జనాలు. 2022లో రిలీజ్ అయిన సెకండ్ పార్టుకి ఓపెనింగ్ డే 39.90 కోట్లు నెట్ వసూలైంది మన దగ్గర. కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో ఆ నెంబర్స్ రిజిస్టర్ అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు థర్డ్ పార్టుకు కూడా అంతే గొప్ప కలెక్షన్లను ఆశిస్తున్నారు పలువురు. కానీ, ఆ నెంబర్స్ ఇప్పుడు సాధ్యమేనా? అనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట పార్టుని చూసినప్పుడు వింతగా అనిపించింది. అదే సెకండ్ పార్టుకి వచ్చేసరికి సినిమాలో ఏం ఉండొచ్చో ఓ అవగాహన వచ్చింది. దాన్ని బట్టి… ఇప్పుడు థర్డ్ పార్టు ఓపెనింగ్ డే మీద ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌ని చూసిన వారు ఓపెనింగ్ డే 30 – 35 కోట్ల దాకా రావచ్చనే అభిప్రాయాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తీరా ఆ రోజు రానే వచ్చాక నిజానిజాలు తెలిసిపోతాయి కదా అంటున్నారు హార్డ్ కోర్ అవతార్ అభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

