రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న రాజమౌళి… నితీష్ హెల్ప్ చేస్తున్నారా ??
భారతీయ సినీ దర్శకులు రాజమౌళి, నితీష్ తివారీ వంటివారు కథనం, విజువల్స్ విషయంలో ప్రపంచానికి కొత్త ప్రమాణాలు నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో రాజమౌళి ఉండగా, నితీష్ తివారీ 'రామాయణం' ద్వారా ప్రపంచ దర్శకులు నేర్చుకుంటారంటున్నారు. ఇది భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్న కొత్త శకానికి నిదర్శనం.
కథ ఎలా ఉండాలో, కథనం ఎలా ఉండాలో, విజువల్స్ ఎలా ఉండాలో, సినిమా అంటే ఎలా ఉండాలో.. ప్రపంచానికి మేం చూపిస్తాం.. అవసరమైతే నేర్పిస్తాం అనే ధోరణితో ముందుకు సాగుతున్నారు ఇండియన్‌మేకర్స్. ఆల్రెడీ సౌత్ నుంచి ఇదే పనిలో ఉన్నారు రాజమౌళి. నార్త్ నుంచి నితీష్ కూడా ఇప్పుడు ఇవే మాటలను పలవరిస్తున్నారు.. మన రేంజ్ పెరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉందంటున్నారు క్రిటిక్స్. హీరో సింపుల్‌గా స్టేజ్ మీదకు నడిచొస్తే ఏం బావుంటుంది? సినిమాలో సీన్‌ని రీ క్రియేట్ చేస్తే కదా.. ఫ్యాన్స్ లో కిక్ కనిపించేది. అందుకే మహేష్ ఎంట్రీని మరో రేంజ్‌లో ప్లాన్ చేశారు జక్కన్న. ఇది జస్ట్ మహేష్ స్టేజ్ మీదకు ఎంట్రీ కావడంలోనే కాదు, మహేష్‌ని ఇంటర్నేషనల్ డయాస్ మీద గ్రాండ్ పరిచయం చేయడం కూడా. తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద అదే రేంజ్‌లో చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి. ఆయన చేస్తున్న విషయానికి మాటల రూపం ఇచ్చేశారు రామాయణ డైరక్టర్ నితీష్ తివారి. సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో, కథని స్క్రీన్ మీద ఎలా చెప్పాలో ఇంటర్నేషనల్ డైరక్టర్లు రామాయణను చూసి నేర్చుకుంటారన్నది నితీష్ చెబుతున్న మాట. రామాయణ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డానని, ఈ సినిమాను తానే తెరకెక్కిస్తున్నానన్న సంగతి నమ్మడానికే తనకు రెండేళ్ల టైమ్ పట్టిందని, విజువల్ వండర్ కోసం అందరూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చని చెప్పేశారు నితీష్. ఆయనలా బయటకు చెప్పకపోవచ్చుగానీ, ఆల్రెడీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు నీల్ అండ్ అట్లీ. ఐకాన్ స్టార్‌తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ వీడియో చూసిన వారికి ఆ సినిమా రేంజ్ గురించి స్పెల్లింగులతో సహా స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్టే అర్థమైపోయేలా చిన్న శాంపిల్ రిలీజ్ చేసింది టీమ్. నెక్స్ట్ కల్కి సీక్వెల్‌ని నాగ్ అశ్విన్ కూడా అంతకు మించే ప్లాన్ చేస్తున్నారు. సో, ఇన్నాళ్లూ వరల్డ్ మూవీస్ చూసి వావ్ అన్న మన జనాలు.. ఇప్పుడు మన సినిమాలు చూసి ప్రపంచం అంతా విస్తుపోయేలా చేయడానికి నడుంబిగించేశారన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

