Tollywood: స్టేజ్‌పై పవన్ పాటకు కృతిశెట్టి, సంయుక్త మీనన్‌ అదిరేటి స్టెప్పులు

ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలు కలర్‌ఫుల్‌గా జరిగాయ్‌. ముగింపు వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సందడి చేశారు సినీ తారలు కృతిశెట్టి, సంయుక్త మీనన్‌.  కృతిశెట్టి, సంయుక్త మీనన్‌ రాకతో సూళ్లూరుపేట కాలేజీ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. హీరోయిన్ల నృత్య ప్రదర్శనలతో మైమరిచిపోయారు ప్రేక్షకులు. 

ఒకపక్క పక్షుల కిలకిలరావాలు మనసులను ఆహ్లాదపరిస్తే.. మరోవైపు సినీతారల అందచందాలు ఆహుతులను కట్టిపడేశాయ్‌. మొత్తం ఫ్లెమింగో ఫెస్టివల్‌కే కొత్త కలరింగ్‌ తీసుకొచ్చారు కృతిశెట్టి, సంయుక్త మీనన్‌. వేదికపై కృతిశెట్టి, సంయుక్త మీనన్‌ చేసిన సందడిని చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదు వీక్షకులకు.  స్టేజ్‌పై ఉన్నంతసేపూ నవ్వులు చిందిస్తూ.. కనిపించారు హీరోయిన్లు. ఫొటోలకు ఫోజులిస్తూ వేదికపై సందడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ మూవీ సాంగ్‌కి కృతిశెట్టి, సంయుక్త మీనన్‌ కలిసి కాలు కదిపారు.  సంయుక్త మీనన్ అయితే.. పవన్‌కల్యాణ్‌ మేనరిజమ్‌ చేస్తూ ప్రేక్షకులను ఆనందపర్చారు. కృతిశెట్టి అయితే.. కమాన్‌ బేబీ సాంగ్‌కి డ్యాన్స్‌చేసి అలరించింది. ఓవరాల్‌గా కృతిశెట్టి, సంయుక్త మీనన్‌ రాకతో ఫ్లెమింగో ఫెస్టివల్‌ ముగింపు వేడుకలు అదరహో అన్నట్టు జరిగాయ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి