Jaabilamma Neeku antha Kopama Review : జాబిలమ్మ నీకు అంత కోపమా రివ్యూ.. ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే..

ఓ వైపు హీరోగా వ‌రుస సినిమాల‌తో చూస్తూ దూసుకుపోతున్న ధనుష్.. మరో సారి డైరెక్టర్‌ గా మారి చేసిన ఫిల్మ్ జాబిలమ్మ నీకు అంత కోపమా! యూత్ ఫుల్ లవ్‌ స్టోరీగా ఇష్టపడి ధనుష్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..! కొన్ని సన్నివేశాలను మనసుకు నచ్చేలా ప్లాన్ చేసి డైరెక్టర్ గా ధనుష్ సక్సెస్ అయ్యాడు.

ప్ర‌భు అలియాస్ ప‌విష్‌ ఓ చెఫ్‌. నీల‌ అలియాస్ అనికా సురేంద్ర‌న్‌ అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డి.. కొన్ని అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఆమెకు దూర‌మ‌వుతాడు. ఆ బ్రేక‌ప్ బాధ నుంచి తేరుకునే లోపే ప్ర‌భు త‌ల్లిదండ్రులు అతడికి ప్రీతి అలియాస్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌తో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అయితే ప్రీతి – ప్ర‌భు చిన్న‌ప్పుడు స్కూల్‌ ఫ్రెండ్స్ కావ‌డంతో పెళ్లి విష‌యంలో వెంట‌నే నిర్ణ‌యం తీసుకోలేక‌పోతారు. కొద్దిరోజులు క‌లిసి ప్ర‌యాణం చేసి త‌మ అభిప్రాయాన్ని చెబుతామ‌ని పెద్ద‌లకు చెబుతారు. అలా క‌లిసి ప్ర‌యాణం చేసి… ఒక‌రికొక‌రు ద‌గ్గ‌రై పెళ్లికి సిద్ధ‌పడాల‌నుకుంటున్న త‌రుణంలో ప్రభుకు అతని మాజీ ప్రేయసి నీల‌ పెళ్లి ఆహ్వానం అందుతుంది. దీంతో త‌ను బాధ‌తో కుంగిపోతాడు. ప్ర‌భు ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ప్రీతి ఆ ప్రేమ‌క‌థ అంతా తెలుసుకుని ఓ నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రి ఆ నిర్ణ‌యం ఏంటి? అది క‌థ‌ను ఎలా మ‌లుపు తిప్పింది? ప్ర‌భు – నీల మ‌ళ్లీ క‌లిశారా? లేక ప్రభు త‌న చిన్న‌నాటి ఫ్రెండ్‌ ప్రీతినే పెళ్లి చేసుకున్నాడా?అన్నది రిమైనింగ్ కథ.