Allu Arjun: అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్.. మెగా బంధంపై ఏమన్నారు.? వీడియో..

|

Nov 11, 2024 | 2:02 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ ఇప్పుటికే స్ట్రీమింగ్ కాగా ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన రెస్పాన్స్ వచ్చింది. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వ‌చ్చారు. పుష్ప 2 మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అల్లు అర్జున్ ఈ షోలో సంద‌డి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య, బన్నీల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సినిమా విశేషాలతోపాటు జాతీయ అవార్డు అందుకోవడం గురించి మాట్లాడుకున్నారు. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని.. ఎలాగైనా సాధించాలనుకున్నానని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ త‌రువాత బాలకృష్ణ చిరంజీవి, మహేశ్‌బాబు లతో సహా ప‌లువురు స్టార్స్ ఫోటోల‌ను చూపిస్తూ.. వారిని చూడ‌గానే ఏమి అనిపిస్తుంద‌ని బాల‌య్య అడిగారు. దీంతో చిరంజీవి, మ‌హేశ్ బాబులతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్.

ఇక అల్లు అర్జున్ తో బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఆ తర్వాత ‘ మీరు గీత ఇవ్వండి, మేము కురుక్షేత్రం చేస్తాం’ అరి అల్లు అర్జున్ అన్నారు. ఆ త‌రువాత మీరు నాకు పార్టీ ఇవ్వ‌లేద‌ని బాల‌య్య అడగ్గా.. ఈసారి కచ్చితంగా ఇస్తాననన్నాడు బన్ని. ఇక అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందన్నాడు అల్లు అల్లు అర్జున్. ఇలా ఎన్నో విషయాల గురించి బాలయ్య, బన్నీలు ముచ్చట్లు చెప్పుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.