IIFA Awards 2024: ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?

IIFA Awards 2024: ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?

Anil kumar poka

|

Updated on: Nov 10, 2024 | 4:44 PM

ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొంది. ఇటీవల ఘనంగా జరిగిన ఐఫా ఉత్సవం అవార్డుల కార్యక్రమానాకి హోస్టింగ్‌ చేసిన రానా , తేజ సజ్జా సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. మా హీరోను అలా ఎలా అంటారు, మా డైరక్టర్‌ను అలా ఎలా అంటారు అని విమర్శలు వస్తున్నాయి. అయితే వాళ్లు అన్న మాటల్లో నిజాలున్నాయి కదా అని మరికొంతమంది అంటున్నారు.

రానా, తేజ సజ్జా తమ హీరోలకు క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అంతగా వాళ్లిద్దరూ ఏమన్నారు, ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా అని తెలియాలి అంటే.. అక్కడ ఏమైందో తెలియాలి. ఐఫా ఉత్సవంలో హోస్ట్‌ల సెటైర్లు, కామెంట్లు ఓ ఆర్డర్‌లో చూస్తే.. తొలుత తేజ సజ్జా గురించి ఇంట్రడక్షన్‌ ఇస్తున్నట్లుగా రానా మాట్లాడి.. ఆఖరికి అవి మహేష్‌ బాబుకోసం అంటాడు. దానికి తేజ ‘అవి నాకు సింక్‌ అయ్యాయి ఏంటి?’ అని అంటాడు.

హద్దుల్లో ఉంటే ఏదైనా అందంగా ఉంటుంది. అన్నవారికీ బావుంటుంది. అనిపించుకున్నవారికీ బావుంటుంది. కానీ కొన్నిసార్లు పదాలు మనుషుల మధ్య దూరం పెంచుతాయి. మనసులను హర్ట్ చేస్తాయి. ఐఫా వేదికగా రానా, తేజ సజ్జా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలాంటి ముప్పు తెచ్చిపెట్టాయా? అసలేమైంది? చూసేద్దాం రండి.. ఈ ఏడాది బచ్చన్‌ హయ్యస్ట్ హై చూశారు.. లోయస్ట్ లో చూశారు అంటూ ఐఫా వేదిక మీద చేసిన కామెంట్‌ వివాదానికి దారి తీసింది. హయ్యస్ట్ హైగా కల్కి గురించి చెబితే లోయస్ట్ లోగా మిస్టర్‌ బచ్చన్‌ని రెఫర్‌ చేశారు హోస్ట్స్. దాంతో ట్విట్టర్‌లో ఫైర్‌ మొదలైంది. అలా ఎలా అంటారంటూ మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అనుకోనీ తమ్ముడూ ఎన్నో విన్నాం.. అందులో ఇదోటి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. నాకైనా.. ఎవరికైనా.. అంటూ హరీష్‌ శంకర్‌ ఒపీనియన్‌ షేర్‌ చేశారు. జస్ట్ మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆ వేదిక మీద సెటైర్లు పడ్డ మిగిలిన సినిమాల హీరోల తాలూకు ఫ్యాన్స్ కూడా ఫైర్‌ అవుతున్నారు. పుష్ప2 లేట్‌గా వస్తోందంటూ తేజ సజ్జా చేసిన వ్యాఖ్యల మీద కూడా గట్టిగానే ఫైర్‌ అవుతున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. అదే వేదిక మీద తన హనుమాన్‌ సినిమా మీద చిన్న మాట పడనివ్వని తేజ.. పుష్పను మాత్రం అంత మాట ఎలా అనగలిగాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

మా జనరేషన్‌లో మంచి నటుడు నాని అంటూ నానిని మెచ్చుకున్న రానాకి, సూపర్‌స్టార్‌ మహేష్‌ మీద సెటైర్లు వేయాల్సిన అవసరమేంటన్నది నెట్టింట్లో సినీ అభిమానుల మధ్య జరుగుతున్న డిస్కషన్‌. తమ మీద తాము జోక్స్ వేసుకుని నవ్వుకునే సంస్కృతి నార్త్ వాళ్లకు ఉంటే ఉండొచ్చు.. సౌత్‌లో సెన్సిబిలిటీస్‌ ఎక్కువ. అవి తెలిసి కూడా ఆ వేదిక మీద మన వాళ్లు రెచ్చిపోవడం ఏంటన్నది గట్టిగా జరుగుతున్న చర్చ. బాలీవుడ్‌ స్టైల్‌ని ఫాలో అవుదామనుకున్న బాబులకు సోషల్‌ మీడియా సెగ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.