Kangana Ranaut: కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!

కంగనా రనౌత్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఎమర్జెన్సీ'కి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంగనా చూస్తున్న క్రమంలోనే.. మరో అనుకోని కొత్త కష్టం వచ్చిపండింది ఈ సినిమాకు. దీంతో ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇదే ఇప్పుడు కంగనకు విపరీతమైన కోపం తెప్పించింది. ఇక ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కంగన ఎమర్జెన్సీ మూవీ.. ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర కూడా ఆగింది.

Kangana Ranaut: కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!

|

Updated on: Sep 01, 2024 | 2:03 PM

కంగనా రనౌత్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఎమర్జెన్సీ’కి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంగనా చూస్తున్న క్రమంలోనే.. మరో అనుకోని కొత్త కష్టం వచ్చిపండింది ఈ సినిమాకు. దీంతో ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇదే ఇప్పుడు కంగనకు విపరీతమైన కోపం తెప్పించింది. ఇక ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కంగన ఎమర్జెన్సీ మూవీ.. ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర కూడా ఆగింది. సెన్సార్ బోర్డ్ తన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని తాజాగా కంగన ఆరోపణలు చేశారు. మొదట్లో తన సినిమా చూసిన సెన్సార్ బోర్డ్‌ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పిన కంగన.. ఆ తర్వాత బోర్డ్ ప్లేట్ ఫిరాయించిందని సీరియస్ అయ్యారు.

ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడం దారుణమని కామెంట్ చేశారు. వాళ్ల పై ఎవరో ఒత్తిడి చేస్తున్నారని.. కావాలనే తమ సినిమాను అడ్డుకుంటున్నారని చెప్పారు. సెన్సార్ బోర్డ్ తీరుపై కోర్టుకు వెళ్లేందుకు కూడా రెడీ అంటూ మీడియాతో చెప్పారు ఈమె. ఇక ఈ సినిమాపై నిషేధం విధించేందుకు కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసిందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో సిక్కు కమ్యూనిటీని చెడుగా చిత్రీకరించారని ఆరోపణలు వచ్చాయి. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే సినిమా విడుదల అవ్వదు. దాంతో ఇప్పుడు కంగనా కాస్త అయోమయంలో పడిందని బీ టౌన్‌లో న్యూస్.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us