Venkatesh Emotional: నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
అన్ స్టాపబుల్ షోకు వచ్చిన గెస్ట్ లను బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఆటపట్టిస్తూంటారు. తమ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే గెస్ట్ లతో గేమ్స్ ఆడిస్తూ.. వాళ్ళతో డ్యాన్స్ లు చేస్తూ మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా బాలయ్య షోకు వచ్చి విక్టరీ వెంకటేష్‌తో కూగా ఇలాగే చేయించారు.
అన్ స్టాపబుల్ షోకు వచ్చిన గెస్ట్ వెంకటేష్‌ను కాస్త కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేసే క్రమంలోనే వెంకీ కూడా తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయా అంటూ బాధపడ్డారు. ఇక ఈ షోలో.. బాలకృష్ణ.. రామానాయుడు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. వెంకటేష్‌తో పాటు.. వెంకీ అన్న సురేష్ బాబు తమ తండ్రి రామానాయుడి చివరి రోజులనుగుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి వల్లే తాము ఇక్కడ ఉన్నామంటూ వెంకీ చెప్పాడు. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చినా.. ఫ్యామిలీని, సినిమాని బ్యాలెన్స్ చేసారన్నాడు. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళని.. చెప్పాడు. అంతేకాదు అలా చివర చదివిన స్క్రిప్ట్‌లో తనతో కలిసి నటిద్దాం అనుకున్నారని వెంకీ చెప్పాడు. కానీ తను అనారోగ్యంగాఉండడంతో.. అది వీలు కాలేదని.. ఆ సినిమా చేసుంటే బాగుండేదని వెంకీ ఎమోషనల్ అయ్యాడు. చివరి రోజుల్లో కూడా తన తండ్రి సినిమా కోసమే బతికారంటూ భావోద్వేగానికి గురయ్యాడు వెంకీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.