Suriya: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు అభిమానులు. అలాగే అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు. అలా సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని అతని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జులై 16న ఈ రక్తదాన శిబిరాన్ని సూర్య సందర్శించాడు. అంతేకాదు అభిమానులతో కలిసి ఆయన కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు.
హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు అభిమానులు. అలాగే అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు. అలా సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని అతని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జులై 16న ఈ రక్తదాన శిబిరాన్ని సూర్య సందర్శించాడు. అంతేకాదు అభిమానులతో కలిసి ఆయన కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. సూర్య పుట్టిన రోజు సందర్భంగా జులై 23 వరకు తమిళనాడు అంతటా ఈ రక్తదాన శిబిరాలు కొనసాగనున్నాయి. ఏటా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య అభిమానులు.
ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. అలా గతేడాది కూడా సుమారు 2000 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆ సమయంలో వీడియో కాల్ ద్వారా అభిమానులతో ముచ్చటించి వారిని అభినందించాడు. అంతేకాదు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవుతానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ రక్తదాన శిబిరానికి వెళ్లి.. తాను కూడా రక్తదానం చేశాడు. అనంతరం ఫ్యాన్స్ తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ సూర్యతో పాటు అతని అభిమానులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆన్ స్క్రీన్ పై ఎంతో స్టైలిష్ గా కనిపించే సూర్య ఈ రక్తదాన శిబిరంలోనూ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.