Mahesh Babu: జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్ ఏంటి.?
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. హాలీవుడ్ , బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా..చాలా మంది పెద్ద సూపర్ స్టార్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అందులోనూ అంగరంగ వైభవంగా జరిగిన అంబానీ ఇంట పెళ్లిలో.. మహేశ్ బాబు తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందర్నైతే ఆకర్షించాడు కానీ..
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. హాలీవుడ్ , బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా..చాలా మంది పెద్ద సూపర్ స్టార్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అందులోనూ అంగరంగ వైభవంగా జరిగిన అంబానీ ఇంట పెళ్లిలో.. మహేశ్ బాబు తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందర్నైతే ఆకర్షించాడు కానీ.. దాంతో పాటే జక్కన్నకు ఇచ్చిన మాట కూడా తప్పినట్టు ఉన్నాడే అనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇక మహేష్ .. దర్శక ధీరుడు SS రాజమౌళి డైరక్షన్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా పనులు మొదలు కాకముందే రాజమౌళి.. మహేష్ బాబు ముందు ఓ విచిత్రమైన కండిషన్ పెట్టాడట. అయితే అంబానీ పెళ్లి కోసం ఈ నిబంధనను మహేష్ బాబు బ్రేక్ చేశాడట.
ఇక ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తెలిసిన రోజు నుంచి జనాలు దీని కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ చలనచిత్రం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సూచించాడట. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కారణంగా తన లుక్‌ను మహేష్ బాబు రివీల్ చేశారు. అనంత్ అంబానీ, రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య, కుమార్తెతో కనిపించాడు. మహేష్ బాబు.. క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.