Sonu Sood: ఏపీ యువతికి సోనూసూద్ సహాయం.. మాటిస్తే అట్లా ఉంటది మరి.!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ సామాజిక సేవలో తోటి నటులకన్నా ముందు ఉంటాడు. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్‌ను ప్రోత్సహించడంలో గానీ, పేదలకు తోచిన విధంగా సహాయం చేయడంలోగాని ఆయనకు ఆయనే సాటి. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సహాయం యావత్ దేశం మదిలో నాటుకుపోయింది. అదే క్రమంలో ఏపీ యువతికి ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారు సోనూసూద్.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ సామాజిక సేవలో తోటి నటులకన్నా ముందు ఉంటాడు. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్‌ను ప్రోత్సహించడంలో గానీ, పేదలకు తోచిన విధంగా సహాయం చేయడంలోగాని ఆయనకు ఆయనే సాటి. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సహాయం యావత్ దేశం మదిలో నాటుకుపోయింది. అదే క్రమంలో ఏపీ యువతికి ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారు సోనూసూద్. ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూరుకు చెందిన దేవికుమారీ అనే అమ్మాయి చదువుకు కావాల్సిన సాయం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు నా చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకున్నారు.
నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్ సర్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం చేశారు. ఆయన నాకు దేవుడితో సమానం’’ అని దేవి ఆనందం వ్యక్తం చేసింది. సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేసింది. ఆ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ. బాగా చదువుకోండి. కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు’’ అని సోనూసూద్ ట్వీట్ ద్వారా తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

