Guntur Karam: బావా ఎంతైనా పర్లేదు బిల్లు.. వేస్‌కో.! కిక్కిస్తోన్న గుంటూరోడి సాంగ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో… మరో కొత్త సాంగ్‌ను రిలీజ్ చేశారు తమన్. రిలీజ్ చేయడమే కాదు.. ఆ సాంగ్‌తో అందర్నీ మరో సారి ఆకట్టుకున్నాడు. అందులోనూ రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా.. అవుతున్నాయి.
“బావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు.. గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు.. చెప్పుకోలేని బాధే డబల్లు.. మారిపోయే లోకం.. చెడ్డోళ్లంతా ఏకం.. నాజుక్కు అయినా నాబోటోడికి దినదినమోక నరకం.. యాడో లేదు లోపం.. నామీదే నాకు కోపం.. అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాము ” అంటూ సాగే హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో స్టెప్పులతో ఇరగదీశాడు మహేష్ బాబు. మొత్తానికి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ ఒక్కో పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అదరగొట్టేశాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos