Prasanth Varma – S.S Rajamouli: ఆ విషయంలో రాజమౌళిపై కోపం వచ్చింది.! మీడియా ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్ వర్మ అన్నారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ‘‘ఆయన మేకింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమనీ అతని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాననీ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే.. ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించాననీ తన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారనీ అన్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్ వర్మ అన్నారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ‘‘ఆయన మేకింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమనీ అతని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాననీ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే.. ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించాననీ తన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారనీ అన్నారు. టీమ్‌లో ఖాళీ లేదన్నారనీ హార్డ్‌వర్క్, టాలెంట్ ఉన్నా తననెందుకు తీసుకోవడం లేదనే కారణంతో రాజమౌళిపై కోపం వచ్చిందనీ తెలిపారు. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారనీ రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అన్నారు.
‘‘పెద్ద హీరోలతో పని చేయడానికి తాను వ్యతిరేకం కాదనీ వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది అన్నారు. వాళ్ల కోసం ఎదురుచూసి తన సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయనీ ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాననీ చెప్పారు. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చినా తన వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా’’ అని ప్రశాంత్ తెలిపారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిన్న సినిమాగా సంక్రాంతికి విడుదలైనా రెండు వారాల్లో రూ. 250 కోట్లు వసూలు చేసింది హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుందని సీక్వెల్‌పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos