AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas - Salaar 2: కాటేరమ్మ ఉగ్రరూపం ముందు ప్రభాస్‌ వీరంగం.! వణికిస్తున్న అసలు కథ.

Prabhas – Salaar 2: కాటేరమ్మ ఉగ్రరూపం ముందు ప్రభాస్‌ వీరంగం.! వణికిస్తున్న అసలు కథ.

Anil kumar poka
|

Updated on: Jan 30, 2024 | 9:59 AM

Share

మన గ్రామ దేవతల గురించి మనం ఏదో టైంలో వినే వుంటాం.! వారి పుట్టుకపై ఉన్న కథలను ఎరిగే ఉంటాం! కానీ సలార్ సినిమాలోని కాటేరమ్మ గురించి నెట్టింట కాస్త వెతుకులాట ఎక్కువైంది. ఈ అమ్మ కథేంటి? ఎలా పుట్టింది? ఈమె కూడా గ్రామ దేవతేనా? అనే వాకబు పీక్స్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. స్కై హై అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైంది.

మన గ్రామ దేవతల గురించి మనం ఏదో టైంలో వినే వుంటాం.! వారి పుట్టుకపై ఉన్న కథలను ఎరిగే ఉంటాం! కానీ సలార్ సినిమాలోని కాటేరమ్మ గురించి నెట్టింట కాస్త వెతుకులాట ఎక్కువైంది. ఈ అమ్మ కథేంటి? ఎలా పుట్టింది? ఈమె కూడా గ్రామ దేవతేనా? అనే వాకబు పీక్స్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. స్కై హై అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైంది. ప్రభాస్‌ మాస్ యాక్షన్ మ్యాజిక్‌ను.. మరో సారి సిల్వర్ స్క్రీన్‌ పై ఆవిష్కరించింది. ఇక అందులోనూ.. కాటేరమ్మ ముందు ప్రభాస్‌ చేసే వీరంగం అందర్నీ ఆకట్టుకుంది. అందులోనూ ఆ ఫైట్‌ చివర్లో.. కాటేరమ్మకు విలన్‌ను బలిచ్చే సీన్‌ అందర్లో పూనకాలు తెప్పించింది. అయితే తెలుగు ఆడియెన్స్‌కు కాటేరమ్మ పేరు కాస్త వెరైటీగా అనిపించింది. అందుకే ఆ అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం నెట్టింట చేస్తున్నారు. ఇక కాటేరమ్మ కూడా.. ఓ గ్రామ దేవతే! కర్ణాటక ప్రజలు కాటేరమ్మగా.. తమిళ్ నాడులోని కొన్ని ప్రాంతాలు కాటేరీ అమ్మన్‌గా కొలుస్తుంటారు. అయితే స్థానికంగా ఉన్న కథల ప్రకారం.. కాటేరమ్మ పార్వతీ మాత ఉగ్రరూపం.

ఇక ఈ తల్లి పుట్టకపై ఓ కథ కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది. అదేంటంటే..! కైలాసంలో పరమ శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట.. ప్రతి రోజూ రాత్రి సమయంలో వెళ్లి, సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వచ్చేదట. అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడట. అయితే తనకు తెలియకుండానే అలా జరిగుతోందని చెప్పిందట పార్వతి. దీంతో ఓ రోజు పార్వతీదేవిని శివుడు అనుసరించాడట. ఆమె అడవులగుండా వెళ్తూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టిన శవాలని బయటకు తీసి తినే ప్రయత్నం చేసిందట. దాంతో శంకరుడు ఉగ్ర రూపంలోని పార్వతిదేవిని ఆపడానికి ఆమె వెళ్లే మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడట. దాంతో ఆమె అందులో పడిపోతుందట. దాంతో ఆమె తేరుకొని చేసినదానికి పశ్చాత్తాపం పడుతుంది. ఆతర్వాత ఆ ఉగ్రరూపాన్ని వదిలి పార్వతీదేవిగా శివుడి వెంట వెళ్లిపోతుందట. ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెప్తుంటారు కన్నడ ప్రజలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos