Prashanth Varma: ‘మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే’ సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్.!

ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంద నుంచి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టంది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

Prashanth Varma: 'మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే' సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్.!

|

Updated on: Apr 25, 2024 | 12:10 PM

ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంద నుంచి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టంది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తనో సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని.. అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.

ఇంతకీ ఈ స్టార్ డైరెక్టర్ ఏం మాట్లాడారంటే..! “ఇది ఎన్నో ఏళ్ల కల. 20 సంవత్సరాల పాటు నేనుూ ఈ యూనివర్స్ తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్స్ రాబోయే చిత్రాల్లోనూ కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రఖని.. హనుమంతుగా తేజ కొనసాగుతాడు. అలాగే ఈ యూనివర్స్ లో చాలా మంది కొత్తవారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేస్తాం. నా సినిమా నచ్చి వారే యూనివర్స్ లో భాగమవ్వాలని ఉందని అడిగారు. అలాగే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. పీవీసీయూపై మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. పాత్ర ఎమోషన్, కంటెంట్, వీఎఫ్ఎక్స్ అన్నింటినిలో జై హనుమాన్ మరో స్థాయిలో ఉంటుంది” అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ