Hanuman vs Guntur Karam: గుంటూరోడు Vs హనుమాన్.! మాకు థియేటర్లు ఇవ్వడంలేదని.. లబోదిబోమంటున్న ప్రొడ్యూసర్.
సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నా హనుమాన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న సినిమా ఇదొక్కటే కాబట్టి. దీనికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ చాలా రోజులనుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో థియేటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతోంది.
సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నా హనుమాన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న సినిమా ఇదొక్కటే కాబట్టి. దీనికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ చాలా రోజులనుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో థియేటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాకే చెప్పుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇవ్వడానికి హైదరాబాదులో చాలామంది ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నా కూడా ఇవ్వనివ్వడం లేదు అంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా తమ సినిమాకు థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అంటున్నాడు. తమకు హైదరాబాదులో ఉన్న మొత్తం థియేటర్స్ అడగడం లేదని.. 76 సింగిల్ స్క్రీన్స్ ఉంటే కనీసం మా సినిమాకు తగ్గట్టు ఒక 15 నుంచి 20 థియేటర్లు మాత్రమే అడుగుతున్నాము అంటున్నాడు నిరంజన్ రెడ్డి.
కానీ ఉన్న 76 థియేటర్లలో 70 ఒకరే తీసుకుంటే.. దానిని గుత్తాధిపత్యం అంటారా లేదంటే వివక్ష చూపించడం అంటారా అనేది మీరే చెప్పాలి అంటున్నాడు ఈయన. అంతేకాదు హైదరాబాదులో చాలామంది థియేటర్ ఓనర్లు తమకు హనుమాన్ సినిమా వేసుకోవాలని ఉంది అంటున్నారని.. కాకపోతే వాళ్ళను వేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత. జనవరి 12న గుంటూరు కారంతో పాటు విడుదలవుతుంది హనుమాన్. ఎదురుగా మహేష్ బాబు సినిమా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఎక్కువ థియేటర్లు వెళ్తాయనే విషయం తమకు కూడా తెలుసు అని.. కాకపోతే తమకేమీ రికార్డు నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవసరం లేదని.. కనీసం మా సినిమా వచ్చినట్టు తెలిసేలా కొన్ని థియేటర్లు మాత్రమే అడుగుతున్నాము అంటున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. ఈయన గోడు తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా వింటున్నారు. అయితే దానికి ఎలాంటి సమాధానం చెప్తారు అనేది మాత్రం తెలియడం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.