AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya Emotional: కెప్టెన్ విజయకాంత్‌ సమాధి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన సూర్య.! వీడియో.

Suriya Emotional: కెప్టెన్ విజయకాంత్‌ సమాధి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన సూర్య.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 06, 2024 | 9:41 AM

కోలీవుడ్ సీనియర్ హీరో.. డీమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు విజయ్‏కాంత్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వస విడిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. నటీనటులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు విజయకాంత్ భౌతికకాయానికి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు.

కోలీవుడ్ సీనియర్ హీరో.. డీమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు విజయ్‏కాంత్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వస విడిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. నటీనటులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు విజయకాంత్ భౌతికకాయానికి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు. ఇక ఆయన మరణించిన సమయంలో పలువురు సినీ ప్రముఖులు విదేశాల్లో ఉండడంతో వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‏కాంత్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఇప్పుడు విదేశాల నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన హీరో సూర్య తాజాగా విజయ్‏కాంత్ స్మారకమందిరాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. విజయ్‏కాంత్ స్మారకం వద్ద వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

“విజయకాంత్‌ అన్న అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడం కోలుకోలేని లోటు. అన్నను కోల్పోవడం చాలా బాధాకరం. పెరియన్న సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. నటీనటుల సంఘాన్ని పునరుద్ధరించడంలో విజయకాంత్ పాత్ర చాలా పెద్దది. అన్నన్‌లాంటి వారు ఎవరూ లేరు.. ఆఖరికి ఆయన ముఖం కూడా చూడకపోవడం నాకు తీరని లోటు.. ఎప్పటికీ గుర్తుండిపోతారు. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ.. ఎనిమిదేళ్లు ఉపవాసం ఉన్నాను. ఆ సమయంలో నన్ను గమనించి నువ్వు నటుడివి.. నీ శరీరంలో శక్తి ఉండాలి అంటూ దగ్గరుండి ఆహారం తినిపించాడు” అంటూ ఎమోషనల్ అయ్యాడు సూర్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.