Tollywood: బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!

Tollywood: బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!

Anil kumar poka

|

Updated on: Oct 20, 2024 | 2:02 PM

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, రవితేజలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మిస్ అయింది. తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమాకి లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలా.. అయితే ఈ వీడియో చూడండి.

మణిరత్నం డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ స్టార్ హీరో ఆరాటపడుతుంటాడు. దర్శకుడు మణిరత్నం తన కెరీర్‌లో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు చేశాడు. వాటిల్లో ఒకటి ‘యువ’. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలో సూర్య, మాధవన్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందించగా.. హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్ కాంబోలో తెరకెక్కింది. అలాగే దీన్ని తెలుగులో మొదట పవన్ కళ్యాణ్, రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ చివరి నిమిషంలో అది వర్కౌట్ కాలేదట.

సూర్య పాత్రలో పవన్ కళ్యాణ్, మాధవన్ పాత్రలో రవితేజను తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేశాడట. వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ ఏం జరిగిందో ఏమో.. లాస్ట్ మినిట్‌లో తమిళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేశారు. ఇక ఆ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. ఆల్ టైం క్లాసిక్‌గా కూడా నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.