AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధ‌నుష్ హీరోగా 'కలాం' బ‌యోపిక్..

Dhanush: ధ‌నుష్ హీరోగా ‘కలాం’ బ‌యోపిక్..

Phani CH
|

Updated on: Aug 02, 2025 | 1:03 PM

Share

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం చాలా మందికి ఆద‌ర్శం. “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన కలాం స్ఫూర్తిదాయక జీవితం ఆధారంగా బ‌యోపిక్‌ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ప్రముఖ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అధికారికంగా ప్రకటించారు. ధ‌నుష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌లాం మూవీ నుండి ధ‌నుష్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుదల చేశారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఒక మహోన్నత ప్రయాణం త్వ‌ర‌లో ప్రారంభమవుతోంది. భారత మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి రాబోతున్నారు. ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అబ్ధుల్ క‌లాం పాత్ర‌ను ధ‌నుష్ పోషించనున్నారు. త్వ‌ర‌లోనే క‌లాం మూవీ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ సినిమాలతో గుర్తింపు పొందిన ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలుగా అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఓం రౌత్ గతంలో ప్రభాస్‌తో రూపొందించిన ‘ఆదిపురుష్’ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా, కలాం బయోపిక్‌తో మళ్లీ సీరియస్ సినిమా మేకింగ్‌కి సిద్ధమయ్యారు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే, ఎక్కువగా జీవిత చరిత్రలనే తెరకెక్కించారు. బాల గంగాధర్ తిలక్ బయోపిక్ గా ‘లోకమాన్య’, ‘తానాజీ’ కథతో హిస్టారికల్ మూవీ, శ్రీరాముడి స్టోరీతో ‘ఆదిపురుష్’ సినిమాలు రూపొందించారు. ఇప్పుడు కలాం బయోపిక్ బాధ్యతను భుజానికి ఎత్తుకోగా, ఈ సినిమాతో త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు . రామేశ్వరానికి చెందిన క‌లాం నిరాడంబర జీవితాన్ని గడిపిన కుటుంబం నుంచి వ‌చ్చి DRDO, ISRO లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసి, దేశానికి అద్భుతమైన సేవలందించారు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prakash Raj: అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా ??

కింగ్డమ్‌తో స్టార్ అయినా.. రోడ్డుపై అమ్మతో.. ఇడ్లీలు అమ్ముకోవడం మానని నటుడు

అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్‌ జాతరంటే..!

చరణ్‌, పవన్‌, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్‌ రాంపేజ్‌

కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు