డిసెంబర్ లో సినిమా జాతర.. గెట్ రెడీ బాయ్స్
డిసెంబర్‌లో సినిమా జాతర జరగబోతుంది. ఓ వైపు తెలుగు సినిమాలు.. మరోవైపు డబ్బింగ్ సినిమాలు.. మీరా మేమా అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నాయి. అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలైతే మరీ డేంజర్.. మన సినిమాలకే ఎర్త్ పెట్టేలా ఉన్నాయి. మరి డిసెంబర్ వార్ ఎలా ఉండబోతుంది..? ఈసారి ఎవరెవరు రేసులో ఉన్నారు..? డిసెంబర్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే సినిమా అఖండ 2.
బాలయ్య హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే 150 కోట్ల మార్క్ టచ్ చేస్తున్నారు బాలయ్య. డిసెంబర్ 5న సోలోగా తాండవం ఆడేందుకు వస్తున్నాడు అఖండ. అఖండ వచ్చిన వారానికే మోగ్లీ అంటూ రానున్నారు రోషన్ కనకాల. యాంకర్ సుమ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన రోషన్.. మోగ్లీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. డిసెంబర్ 12న రానుంది ఈ చిత్రం. డిసెంబర్ 25న పెద్ద యుద్ధమే జరగబోతుంది. అడివి శేష్ డెకాయిట్ క్రిస్మస్ డేట్ లాక్ చేసినా.. వాయిదా పడేలా కనిపిస్తుంది. అదేరోజు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్, ఆది సాయికుమార్ శంభాల, గుణశేఖర్ యుఫోరియా లాంటి సినిమాలు రానున్నాయి. కానీ వీటన్నింటికీ డిసెంబర్ 19న రాబోయే అవతార్ 3తో పెద్ద పోటీయే ఎదురుకానుంది. డిసెంబర్‌లో డబ్బింగ్ దండయాత్ర కూడా జరగనుంది. ప్రదీప్ రంగనాథన్ LIK డిసెంబర్ 18న రానుంది.. ఇక కార్తి హీరోగా నటిస్తున్న వా వాతియార్ డిసెంబర్ 5న విడుదల కానుంది. అఖండ 2తో పోటీకి సైతం అంటున్నారు కార్తి. అలాగే సూర్య నటిస్తున్న కరుప్పు సైతం డిసెంబర్‌లోనే విడుదల కానుందని తెలుస్తుంది. మొత్తానికి ఈసారి డిసెంబర్ అంతా హౌజ్ ఫుల్ అయిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

