Prithviraj: కమెడియన్ పృథ్వీ రాజ్‌ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ.!

పృథ్వీ రాజ్‌..! స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోయే క్రమంలోనే.. కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుకుని సినిమాలకు కాస్త దూరమయ్యాడు ఈయన. అడపాదడపా రాజకీయ కామెంట్స్‌తో అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ కూడా అయ్యేవాడు. అలాంటి ఈ కమెడియన్ మరో సారి చిక్కుల్లో చిక్కున్నాడు. ఈ సారి ఏకంగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు.

Prithviraj: కమెడియన్ పృథ్వీ రాజ్‌ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ.!

|

Updated on: Jun 14, 2024 | 10:19 AM

పృథ్వీ రాజ్‌..! స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోయే క్రమంలోనే.. కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుకుని సినిమాలకు కాస్త దూరమయ్యాడు ఈయన. అడపాదడపా రాజకీయ కామెంట్స్‌తో అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ కూడా అయ్యేవాడు. అలాంటి ఈ కమెడియన్ మరో సారి చిక్కుల్లో చిక్కున్నాడు. ఈ సారి ఏకంగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరికాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరింది.

దీనిని 2017 జనవరి 10న విచారించిన కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణంతోపాటు.. కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్విరాజ్‌ హైకోర్టులో దీనిని సవాలు చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు రూ.22 వేలు చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మీకి భరణం చెల్లించడంతో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. పైగా కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోమారు భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేయడంతో.. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నాగ పంచమి పూజ, శుభ సమయం ఎప్పుడంటే..?
నాగ పంచమి పూజ, శుభ సమయం ఎప్పుడంటే..?
జస్ట్ మిస్.. దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయటపడ్డాడుగా..
జస్ట్ మిస్.. దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయటపడ్డాడుగా..
'ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం.. మా మూవీకి రండి'..మల్టీప్లెక్స్‌ ఆఫర్
'ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం.. మా మూవీకి రండి'..మల్టీప్లెక్స్‌ ఆఫర్
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ఎడారి దేశంలో తెలుగు కార్మికుడి కష్టాలు.. బాధితుడికి లోకేశ్ భరోసా
ఎడారి దేశంలో తెలుగు కార్మికుడి కష్టాలు.. బాధితుడికి లోకేశ్ భరోసా
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
KCR: సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌
KCR: సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌
చిత్తూరు జిల్లాలో వింత ఆచారం.. ఒకరోజు ఊరు బయట గడిపిన గ్రామస్థులు
చిత్తూరు జిల్లాలో వింత ఆచారం.. ఒకరోజు ఊరు బయట గడిపిన గ్రామస్థులు
కల సాకారం చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. సెలూన్ బిజినెస్‌లోకి వీజే
కల సాకారం చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. సెలూన్ బిజినెస్‌లోకి వీజే
ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.
ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
KCR: సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌
KCR: సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌
ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.
ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.
హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.
హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.
దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. రానున్న మూడురోజులూ.!
దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. రానున్న మూడురోజులూ.!
ప్రజాభవన్‌లో బోనాల వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
ప్రజాభవన్‌లో బోనాల వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.