Chiranjeevi: ఇది కదా గొప్ప విషయం అంటే.! పద్మ శ్రీలకు చిరు చిరుసత్కారం..

Chiranjeevi: ఇది కదా గొప్ప విషయం అంటే.! పద్మ శ్రీలకు చిరు చిరుసత్కారం..

Anil kumar poka

|

Updated on: Jan 31, 2024 | 11:18 AM

మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నయ్య చిరంజీవి తీరే వేరు కదా.. అందరూ తన ఇంటికి వచ్చి విషెస్ చెబుతుంటే.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు.

మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నయ్య చిరంజీవి తీరే వేరు కదా.. అందరూ తన ఇంటికి వచ్చి విషెస్ చెబుతుంటే.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, డాక్టర్. ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. సత్కరించడమే కాదు.. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరమని అన్నారు చిరు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos