మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేయనున్న తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ విడుదలైంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, ఆ తర్వాత బాబీతో మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ దిగ్గజాల కలయిక సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల వేగాన్ని పెంచారు. ఇప్పటికే విశ్వంభర చిత్రీకరణను పూర్తి చేసిన చిరంజీవి, ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం, ఆయన యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే మ్యాజిక్‌ను పునరావృతం చేయాలనే ఉద్దేశ్యంతో, ఈసారి కూడా మల్టీస్టారర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్ రవితేజతో చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోగా, ఈసారి ఒక సూపర్ స్టార్‌తో కలిసి నటించబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

