Kavya alias Deepika: బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

Kavya alias Deepika: బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

Anil kumar poka

|

Updated on: Aug 15, 2024 | 4:41 PM

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజ‌న్‌లోకి బ్ర‌హ్మ‌ముడి సీరియల్ న‌టి కావ్య రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళుతోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య- రాజ్‌ జోడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక న‌టి కావ్య విషయానికి వస్తే.. ఆమె అస‌లు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా ‘చిత్రం పేసుతాడి’ అనే తమిళ సీరియల్ లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది.

ఈ సీరియల్ తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీ‌ముఖి నిన్ను మ‌రో మూడు నెలల పాటు షోకు రానివ్వం’ అని అంది. దీంతో వెంట‌నే దీపికా ‘ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో దీపిక నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతంద‌నే వార్త నెట్టంట హాల్‌చ‌ల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మాములుగా ఉండదే కామెంట్ వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.