Kapil Sharma: సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ కమెడియన్.!
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రెటీల్లో కపిల్ శర్మ ఒకరు. కపిల్ శర్మ టీవీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందాడు. గత దశాబ్దానికి పైగా టీవీలో కామెడీ షోను హోస్ట్ చేస్తూ జనాలకు దగ్గరయ్యాడు కపిల్ శర్మ. అంతకుముందు అతడు స్టాండప్ కమెడియన్. ప్రస్తుతం ఈ టాక్ షో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. కపిల్ శర్మ టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కూడా పేరు పొందాడు.
బుల్లితెర ద్వారా వందల కోట్లు సంపాదించిన కపిల్ శర్మ సినిమాల్లోకి వెళ్లి మొత్తం పోగొట్టుకున్నాడట. ‘ఫీల్ ఇట్ ఇన్ యువర్ సోల్’ పేరుతో యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కపిల్ శర్మ.. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. అలాగే తన జీవితంలో పాత రోజులను గుర్తు చేసుకున్నారు కపిల్ శర్మ. తాను కేవలం 1200 రూపాయలు జేబులో పెట్టుకుని ముంబైకి వచ్చానని.. చాలా రోజులు తాను ఒక్క పూట తినడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డానన్నాడు. ఆ తర్వాత కపిల్ శర్మ షో ద్వారా సక్సెస్ అయ్యానని చెప్పాడు. అంతేకాదు అప్పుడు తన దగ్గర చాలా డబ్బు ఉందని.. దాంతో తాను సినిమా నిర్మాతగా మారి రెండు సినిమాలు చేశానని చెప్పాడు కపిల్. కానీ డబ్బుంటే నిర్మాత కాలేరని ఆ తర్వాత అర్థమైందని షాకింగ్ కామెంట్ చేశాడు.
నిర్మాతగా మారాలంటే భిన్నమైన ఆలోచన, ఫ్యాషన్, నాలెడ్జ్ ఉండాలని అర్థమైందన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి సినిమా చేశాననీ.. ఆ సినిమాలతో సక్సెస్ రాలేదన్నాడు. దీంతో తన దగ్గరున్న డబ్బు మొత్తం పోయిందన్నాడు. తన బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యిందని.. తాను సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నానంటూ.. ఎమోషనల్ అయ్యాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని.. ఆ తర్వాత తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందని చెప్పాడు. కష్ట సమయంలో తన భార్య గిన్నీ తనకు చాలా సహాయం చేసిందని.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే జరిగిన దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. ఇప్పుడు మళ్లీ సరైన దారిలోకి వెళుతున్నాను అంటూ.. కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈ స్టార్ కమెడియన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.